తూ.గో: గంజాయి రవాణా అరికట్టడానికి ప్రత్యేక దృష్టి సారించామని, దీనికి గాను రాష్ట్రంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు ఏలూరు రేంజ్ ఐజీపీ జీవీ అశోక్‌కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. కాకినాడ జిల్లా నుంచి ఏజెన్సీ వరకూ ఉన్నా రహదారుల్లో ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.