ADB: జైనథ్ ఆదర్శ పాఠశాలలో గంటల ప్రాతిపదికన బోధించడానికి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ రాము గురువారం తెలిపారు. పీజీటీ విభాగంలో ఆంగ్లం, ఎకనామిక్స్, కామర్స్, పొలిటికల్ సైన్స్, హిందీ, టీజీటీ విభాగంలో ఆంగ్లం, సైన్స్ పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. ఈ నెల 27 లోపు ఆదర్శ పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.