కోనసీమ: అమలాపురం ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటరులో గురువారం ఉచిత షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మున్సిపల్ ఛైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి ప్రారంభించారు. మెడ్ యునైటెడ్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది శిబిరంలో వైద్యసేవలు అందించారు. సీనియర్ సిటిజన్స్‌తో పాటు పట్టణ పోలీసులకు వైద్య పరీక్షలు చేశారు.