ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తమిళనాడు అథ్లెట్లకు ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ భారీ నజరానాలు అందించారు. ఈ క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్‌లో రజతం పతకం గెలిచిన తులసిమతి మురుగేశన్కు సీఎం రూ.2 కోట్ల చెక్ అందజేశారు. కాంస్య పతకాలు సాధించిన మనీషా రామదాస్, నిత్యశ్రీకి చెరో కోటి రూపాయల చెక్‌లు అందించారు. పురుషుల హైజంప్‌లో కాంస్యం గెలిచిన అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు రూ.కోటి చెక్ అందించారు.