భారత్లో త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఈ-కామర్స్ కంపెనీలు తమ సన్నాహాలు ప్రారంభించాయి. ఇందులో రూపాయికే ఐఫోన్ అంటూ ఓ సంస్థ ప్రకటన ఇచ్చింది. అయితే ఇలాంటి ప్రకటనలను చూసి, వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఈ-కామర్స్ వెబ్ సైట్లను లాగిన్ చేస్తారని.. అదే సమయంలో సైబర్ నేరస్థులు రెచ్చిపోతారని కేంద్రం దృష్టి పెట్టింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని పలు సంస్థలను హెచ్చరించింది.