భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాపై సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. భారత క్రికెట్కు బుమ్రా రత్నకిరీటం లాంటోడంటూ కొనియాడారు. ఫిట్నెస్ విషయంలో బుమ్రా మాటలే సత్యమేనని వెల్లడించాడు. మరోవైపు ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ కూడా బుమ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేవుడు అందరిలా కాకుండా బుమ్రాను ప్రత్యేకంగా తయారుచేశాడని తెలిపాడు. ఎంతో అనుభవం ఉన్న అతడి అడుగుజాడల్లో నడవడం అంత సులభం కాదన్నాడు.