ప్రకాశం: కనిగిరి మండలంలోని నందన మారెళ్ళలో వెలిసిన శ్రీ బాలార్క బాల కోటేశ్వర స్వామి ఆలయంలో అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వేద పండితులు రామకృష్ణ శర్మ సోమవారం తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు ఆలయంలో కుంకుమార్చనలు, శ్రీ చండి రుద్ర హోమం, అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించనున్నారు.