రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఆదివారం మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలే పోటీ జరిగింది. ఈ పోటీల్లో ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’ టైటిల్ను రియా సింఘా గెలుచుకుంది. గ్లోబల్ మిస్ యూనివర్స్ 2024లో రియా భారత్కు ప్రాతినిధ్యం వహించనుంది. విజయాన్ని కైవసం చేసుకున్న ఆనందంలో ఆమె మాట్లాడుతూ.. ఈ స్థాయికి చేరుకోవడానికి తాను చాలా శ్రమించానంటూ చెప్పుకొచ్చింది.