ప్రకాశం: మార్కాపురంకు చెందిన MBBS విద్యార్థి హరిదిప్ మారేడుమల్లి జలపాతంలో గల్లంతయ్యాడు. ఆదివారం తన మిత్రులతో కలిసి హరిదీప్ మారేడుమల్లి జలపాతానికి వెళ్ళాడు. సరదాగా స్నానం చేస్తున్న సమయంలో భారీ వర్షం కురిసింది. నీటి ప్రవాహం ఎక్కువగా రావడంతో 5 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఇద్దరు సురక్షితంగా బయటపడగా ముగ్గురు గల్లంతైన వారిలో హరిదీప్ కూడా ఉన్నాడని సమాచారం.