అమెరికాలో తుపాకీ సంస్కృతి నానాటికి పెరిగిపోతుంది. అక్కడ మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అలబామా రాష్ట్రం బిర్మింగ్హమ్లోని ఓ బార్లో జరిగిన కాల్పుల ఘటనలో ఓ మహిళ సహా నలుగురు చనిపోయారు. మరో 18 మంది గాయాలపాలయ్యారు. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.