WG: కాళ్ళ మండలం ఏలూరుపాడులో అంబేడ్కర్ ఫ్లెక్సీని చింపి రాజ్యాంగ నిర్మాతను అవమానించినందుకు పోలవరంలో దళితులు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాల మహానాడు నేత మోహన్ మాట్లాడుతూ.. ఉండి ఎమ్మెల్యేపై రాజద్రోహం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.