AP: తిరుమల పవిత్రతను కాపాడే బాధ్యత భగవంతుడు తనకు ఇచ్చాడని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల ప్రక్షాళన కోసమే ప్రత్యేకంగా శ్యామలరావును పంపించానని.. భగవంతుడు ఇచ్చిన ఆదేశాలను ఈవోకి అప్పగించానని పేర్కొన్నారు. ఇంతకాలం భయం, భక్తి, నమ్మకం ఆధారంగానే ప్రసాదాల తయారీ జరిగిందని.. ఎంతో రుచిగా ఉండాల్సిన తిరుమల లడ్డూ పేలవంగా పాచిపోయినట్టు కనిపించిందని తెలిపారు. కల్తీ పరీక్షల కోసం ఎలాంటి ప్రత్యేక వ్యవస్థ లేదని మండిపడ్డారు.