NZB: నందిపేట్ మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా నేడు ప్రజలకు నిషేధిత ప్లాస్టిక్‌పై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ప్రజలు ప్లాస్టిక్‌ను వాడవద్దని బట్ట సంచులను వాడాలని సూచించారు. గ్రామంలో 115 కిలోల ప్లాస్టిక్‌ను సేకరించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.