హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం బీజీపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం రుణాలు తీసుకొని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి ఇవ్వడంతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని.. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసన్నారు. ఎన్నికల్లో ఇంత ఖర్చు ఎలా పెడుతున్నారోనని తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రధాని మోదీ యుగపురుషుడని కంగనా కొనియాడారు.