AP: సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీమంత్రి రోజా అన్నారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకే లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. సీఎం చేసిన తప్పులకు పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీటీడీ స్వయం ప్రతిపత్తి సంస్థ అని, సీఎంకు సంబంధం లేదని మంత్రి లోకేష్ అన్నారని.. అలాంటప్పుడు జగన్కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. ఈవోపై ఒత్తిడి తెచ్చి ప్రెస్మీట్ పెట్టించారని తెలిపారు.