TG: సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లేఖ రాశారు. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజాపరిపాలన దినోత్సవం’ పేరుతో అధికారికంగా జరపడం సంతోషకరమన్నారు. కానీ ఆ పేరు కారణంగా ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, కమ్యూనిస్టుల త్యాగాలు, కాంగ్రెస్, సోషలిస్టు అగ్రనేతల త్యాగాలు ప్రస్తుత, భవిష్యత్ తరాలకు తెలియకుండా పోయే ప్రమాదం ఉన్నదన్నారు.