ELR: జంగారెడ్డిగూడెం రాజులకాలనీలో సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణపయ్య నిమజ్జన ఊరేగింపు ఆదివారం నేత్రపర్వంగా నిర్వహించారు. కోలాట నృత్య ప్రదర్శనలతో స్వామి వారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నారు. పట్టణ పురవీధుల గుండా ఎంతో శోభాయమానంగా గణపయ్య ఊరేగింపు సాగింది.