SRD: ఓటరు జాబితా డ్రాప్ట్ను అక్టోబర్ 29న ప్రకటించనున్నట్లు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం తెలిపారు. నవంబర్ 9, 10 తేదీల్లో ఓటరు నమోదు శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 28 వరకు ఓటు జాబితాలో అభ్యంతరాలపై దరఖాస్తులు స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు.