MNCL: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు, మూడు క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని సెప్టెంబర్ 30న హైదరాబాద్లో జరగనున్న మహాధర్నా విజయవంతం చేయాలని IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ. కృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంటాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేసి కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.