ADB: ఎంపీ నగేష్‌ను తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రంజిత్ కుమార్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తలసేమియా, సికిల్‌సెల్ పేషెంట్లకు రిమ్స్ మెడికల్ కాలేజీలో రక్తం ఎక్కించే సెంటర్ ప్రారంభించాలని కోరుతూ.. ఎంపీకి వినతి పత్రం అందజేశారు. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల సమస్యల పరిష్కారానికై తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.