భారత్ నుంచి అక్రమ రవాణా ద్వారా వివిధ మార్గాల్లో తరలిపోయి అమెరికాను చేరిన కళాఖండాలు తిరిగి స్వదేశానికి చేరనున్నాయి. క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత్కు చెందిన 297 పురాతన వస్తువులు తిరిగి ఇచ్చేందుకు భారత్- అమెరికాల మధ్య ఒప్పందం కుదురింది.