ఏపీలో రాజకీయ పరిణామాలు మరింత ఉత్కంఠకరంగా మారుతున్నాయి. ఇటీవల YSRCP రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మరియు మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు పార్టీ మారుతామని ప్రకటించారు. ఈ ఇద్దరు ఎంపీలు టీడీపీలో చేరుతున్నామని ప్రకటించారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనమే కలిగించింది
మోపిదేవి వెంకటరమణ తన పార్టీ మార్పు నిర్ణయాన్ని ప్రకటిస్తూ, YSRCP నుండి రాజీనామా చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు. అయితే, ఆ కారణాలను వెల్లడించలేనని ఆయన స్పష్టం చేశారు. ‘YSRCP నుండి ఎమ్మెల్యే టిక్కెట్ నిరాకరించబడటంతోనే నా నిర్ణయం తీసుకున్నాను’ కానీ కొద్దీ రోజులు ఆగానని ఆయన తెలిపారు. పార్టీ అధిష్టానం తనకు టికెట్ ఇవ్వకపోవడంతో, రాష్ట్ర రాజకీయాలలో ఆక్టివ్ గా ఉండాలని భావించారని మోపిదేవి చెప్పుకొచ్చారు. అలాగే, బీదా మస్తాన్ రావు కూడా టీడీపీ లో చేరినట్లు ప్రకటించారు. మోపిదేవి, బీదా మస్తాన్ రావు టీడీపీకి చేరడం, పార్టీలోకి కొత్త ఉత్సాహం, శక్తిని తీసుకురావచ్చని భావిస్తున్నారు టీడీపీ నేతలు
ప్రస్తుతం, ఈ మార్పులు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలను మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. మిగిలిన రాజ్యసభ సభ్యులు కూడా కూటమి పార్టీల వైపు పక్క చూపులు చూస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక, మోపిదేవి వెంకటరమణ మరియు బీదా మస్తాన్ రావు వంటి కీలక నేతల టీడీపీ చేరిక, ఆ పార్టీకి మరింత బలోపేతం, సమర్థవంతతను తీసుకురావడంలో సహాయపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు