కేరళ వాయనాడ్ లో వరద బీభత్సం అంతాఇంతా కాదు. ఇప్పటివరకు 350 మంది మృతులను గుర్తించారు రెస్క్యూ బలగాలు. 250 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. రెస్క్యూ ఒపేరాశన్స్ లో ఉన్న బలగాలు, పోస్ట్ మోర్టమ్ చేస్తున్న డాక్టర్లు సైతం నివ్వెరపోయే రీతిలో మృతదేహాలు. ఇంత భయానక వరద ప్రాంతలలో నేనుసైతం అంటూ పాల్గొన్నారు హీరో మోహన్ లాల్. కోళికోడ్ నుంచి వాయనాడ్ రోడ్ మార్గంలో వచ్చి ఆర్మీ బలగాలతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు
టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టీనెంట్ కల్నల్ గా ఉన్న మోహన్ లాల్ టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంపు కు వచ్చి ఆర్మీ తో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వాయనాడ్ డిసాస్టర్ కు బాసటగా ఎంతోమంది ప్రముఖులు, సెలెబ్రిటీలు నిలుస్తున్నారు. కమల్ హాసన్, నయనతార, రష్మిక మందనతో సహా అనేకమంది సినీ తారలు కేరళ ప్రజల కోసం బాసటగా నిలిచారు
గల్లంతయిన వారిని గుర్తించడం కోసం రెస్క్యూ టీం అధికారులు టెక్నాలజీని వాడుతున్నారు. రాడార్లు, డ్రోన్లు, మొబైల్ సిగ్నలింగ్, GPS ద్వారా చాలామందిని గుర్తించారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారు, మెడికల్ స్టాఫ్, నర్సులు మించి భాదితుల ప్రాణాలను కాపాడటానికి వందలాది ఆసుపత్రుల్లో, మెడికల్ క్యాంపు లలో 24 గంటలూ శ్రమిస్తున్నారు