»Four Members Of A Kerala Family Died In A Fire In Kuwait
Fire Accident : కువైట్‌లో మరో అగ్నిప్రమాదం.. ఇద్దరు దంపతులు సహా నలుగురు మృతి
కువైట్ సిటీలోని ఓ ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో భారతీయ దంపతులు, వారి ఇద్దరు పిల్లలు చనిపోయారు. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు శనివారం తెలిపారు.
Fire Accident : కువైట్ సిటీలోని ఓ ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో భారతీయ దంపతులు, వారి ఇద్దరు పిల్లలు చనిపోయారు. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు శనివారం తెలిపారు. ఆ కుటుంబం సెలవుల అనంతరం అదే రోజు కేరళ నుంచి తిరిగి వచ్చింది. మాథ్యూస్ ములక్కల్, అతని భార్య లిన్నే అబ్రహం.. వారి ఇద్దరు పిల్లలు శుక్రవారం రాత్రి అబ్బాసియా ప్రాంతంలోని వారి రెండవ అంతస్తు ఫ్లాట్‌లో ఉన్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఎయిర్ కండీషనర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఊపిరాడక మృతిచెందారు. వీరంతా అలప్పుజాలోని నీరట్టుపురం నివాసితులు.
ఈ కుటుంబం కేరళలో సెలవులు ముగించుకుని శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కువైట్‌కు తిరిగి వచ్చినట్లు చెబుతున్నారు. మాథ్యూస్ ములక్కల్ రాయిటర్స్‌లో పని చేయగా, అతని భార్య లిన్ అల్ అహ్మదీ గవర్నరేట్‌లోని అడెన్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా ఉన్నారు. వారి పిల్లలు కువైట్‌లోని భవన్స్ స్కూల్లో చదివారు. మాథ్యూ గత 15 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నాడని బంధువు ఒకరు శనివారం కేరళలో తెలిపారు. సెలవులు జరుపుకుని కుటుంబం గురువారం రాత్రి నెడుంబస్సేరి విమానాశ్రయం నుండి బయలుదేరింది.
ఇదిలావుండగా, కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్లో ఒక పోస్ట్‌లో మాట్లాడుతూ.. అబాసియాలో ఫ్లాట్ అగ్నిప్రమాదంలో మాథ్యూస్ ములక్కల్, అతని భార్య, ఇద్దరు పిల్లల విషాద మరణం పట్ల రాయబార కార్యాలయం తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు తెలిపింది. ఎంబసీ వారి కుటుంబంతో టచ్‌లో ఉంది. వీలైనంత త్వరగా మృత దేహాలను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తుంది. జనరల్ ఫైర్ ఫోర్స్ యాక్టింగ్ చీఫ్, మేజర్ జనరల్ ఖలీద్ ఫహద్ సంఘటన స్థలంలో ఉన్నారు. అపార్ట్మెంట్ భవనంలో మంటలను తమ బృందాలు విజయవంతంగా అదుపులోకి తెచ్చాయని చెప్పారు.