»Heavy Rains Continue To Lash Telangana And Ap Overnight Brace For More Showers
Rains : తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వానలు.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు
గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ చదివేయండి.
Yellow alert for rains in Telangana state for next five days
Heavy Rains : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కుండపోత వానల వల్ల ప్రాజెక్టులు, చెరువులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణలో ఈ వారాంతంలో రికార్డు వర్షపాతం నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్లో కురిసిన వర్షాలకు బొబ్బిల్లంక, మిర్తిపాడు రహదారిపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు(Showers) ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల(Heavy Rains) కారణంగా గోదావరి వరద పోటెత్తుతోంది. ములకల్లంక రహదారి పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కొవ్వాడ కాలువ దగ్గరలో ఉన్న పంట పొటాలన్నీ నీట మునిగాయి. నిడదవోలు, చాగల్లు, కొవ్వూరు, దేవరపల్లి, గోపాలపురం, తాళ్లపూడి మండలాల్లోని వరి నాట్లన్నీ నీట మునిగాయి. వేల ఎకరాల్లో పంటలు నీట నానుతున్నాయి. కోనసీమ జిల్లాలోనూనిబూరుగుల్లంక దగ్గర గోదావరి లంకల్లో ఉండే ప్రజలు రాకపోకలు సాగించే రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో అధికారులు నాలుగు లంక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు అక్కడ అధికారులు బోట్లను ఏర్పాటు చేశారు.
తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురంలో అత్యధికంగా 109 మి.మీ వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్లలో 96.8మి.మీ వరకు వానలు నమోదయ్యాయి. అలాగే హనుమకొండ, వరంగల్, కరీంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి, ఆషిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లోనూ 40 నుంచి 80 మి.మీ వరకు వర్షపాతం నమోదైంది. దీంతో పలు చోట్ల రహదారులు నీట మునిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.