»Kcrs Petition Against Electricity Commission In Supreme Court Adjourned
KCR: సుప్రీంకోర్టులో విద్యుత్ కమిషన్‌పై కేసీఆర్ వేసిన పిటిషన్ వాయిదా
కేసీఆర్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలుపై విచారణ జరపాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తుందని కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈరోజు కోర్టు సమయం ముగియడంతో విచారణ రేపటికి వాయిదా వేశారు.
KCR's petition against Electricity Commission in Supreme Court adjourned
KCR: విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ రేపటికి వాయిదా పడింది. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ కొనుగోలుపై విచారణ జరపాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఈ విద్యుత్ కమిషన్‌ను నియమించింది. ఛత్తిస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయి అని తాజా ప్రభుత్వం ఆరోపణల మేరకు ఈ కమిషన్‌ను నియమించింది. దీనిపై కేసీఆర్ గతంలోనే లేఖ రాశారు. ఇది కక్షపూరితమైన కమిషన్ అని మార్యదపూర్వకంగా కమిషన్ వెనక్కి వెళ్లాలంటే అందులో పేర్కొన్నారు.
తరువాత కమిషన్ మళ్లీ విచారణకు హాజరుకావాలని కేసీఆర్‌ను ఆదేశించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేసీఆర్. విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను రేపు విచారిస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. విచారణ జరుగు సమయంలో సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో కేసీఆర్ తరఫు న్యాయవాది మోహిత్ రావు పాస్ ఓవర్ కోరారు. దాంతో కోర్టు సమయం ముగియడంతో విచారణ రేపు ఉదయానికి వాయిదా పడింది.