తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపింది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రగతిభవన్‌లో మంత్రివర్గం సమావేశమైంది. బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతారు.ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే అవుతుంది. సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించే అవకాశం ఉంది. రైతుబంధు, రైతు బీమా, దళితబంధుకు కేటాయింపులు కంటిన్యూ అవుతాయి. అన్నివర్గాలను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టిన పథకాలకే నిధుల కేటాయింపు ఉండనుంది.
సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో గల నాందేడ్‌కు బయలుదేరతారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రం వెలుపల తొలి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ సభకు బీఆర్ఎస్ జాతీయ అధ్య క్షులు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరువుతారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్‌కు బయల్దేరతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సచ్‌ఖండ్‌బోడ్ మైదాన్ సభలో కేసీఆర్ పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు మీడియాతో మాట్లాడుతారు. 5 గంటలకు హైదరాబాద్ తిరుగుపయనం అవుతారు.