Hajj Pilgrimage: Saudi revealed that 1300 people died in the Hajj pilgrimage!
Hajj Pilgrimage: ముస్లింల పవిత్ర హజ్ యాత్రకు ఎంతోమంది తరలి వెళ్తుంటారు. అయితే ఈ ఏడాది హజ్ యాత్రలో 1300 మందికి పైగా మృతి చెందినట్లు సౌదీ అధికారిక వర్గాలు తెలిపాయి. చనిపోయిన వారిలో ఎక్కువగా తీవ్రమైన ఎండ, ఉక్కపోత, వడదెబ్బ కారణంగానే చనిపోయినట్లు తెలిపారు. వీరిలో 83 శాతం మంది చట్టవిరుద్ధంగా వచ్చినవారే అని తెలిపారు. అయితే ఎలాంటి పత్రాలు లేకపోవడం వల్ల మృతులను గుర్తించడం కష్టంగా ఉందని సౌదీ తెలిపింది.
Almost two millions of pilgrims has performed the Hajj easily and safely, with all needed services, the numbers of deaths are 1301 and 83% of them has no permit and tried to came to #Mecca through mountains with no shelter and with high temperatures #Hajjpic.twitter.com/QOt2Hytndt
చట్టవిరుద్ధంగా హజ్ యాత్రకు వచ్చిన వాళ్లను అక్కడి అధికారులు వెనక్కి పంపారు. కానీ కొంతమంది ఎలాగో చేరుకున్నారు. అయితే వీళ్లు ఉండటానికి ఎలాంటి హోటళ్లు, గూడారాలు లేవు. దీంతో ఎండవల్ల మరణించారు. మృతుల్లో 165 మంది ఇండోనేషియా, 98 మంది భారతీయులు, తక్కువ సంఖ్యలో జోర్డాన్, టునీషియా, మొరాకో, అల్జీరియా, మలేషియాతో పాటు ఇతర దేశాల నుంచి కూడా ఉన్నారు. ప్రతి ఏడాది ఐదు రోజుల పాటు జరిగే ఈ యాత్రలో దాదాపు 20 లక్షల మంది సౌదీ వెళ్తుంటారు. తొక్కిసలాటలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు.