»Kalki 2898ad Ticket Price Hike For Kalki Movie In Telangana How Much Per Ticket
Kalki 2898AD: తెలంగాణలో కల్కి సినిమాకు టికెట్ ధరల పెంపు.. ఒక్కో టికెట్‌పై ఎంతంటే?
నాగ్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొనే కనిపించనుండగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమలహాసన్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోలకు, టికెట్లు రేట్లు పెంపుకు అనుమతి ఇచ్చింది.
Kalki 2898AD: Ticket price hike for Kalki movie in Telangana.. How much per ticket?
Kalki 2898AD: నాగ్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొనే కనిపించనుండగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమలహాసన్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా విడుదల అయిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరో నాలుగు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం స్పెషల్ షోలు వేసుకోవడంతో పాటు టికెట్ రేట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం భారీగా పెంచాయి.
స్పెషల్ షోలు నిర్వహించుకునేందుకు ఈ నెల 27 నుంచి జులై 4 వరకు అనుమతి ఇచ్చింది. రోజుకు ఐదు షోలు వేసుకోవడంతో పాటు టికెట్ ధర రూ.200 పెంచుకునేందుకు హోంశాఖ అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోలో టికెట్ రేట్లు పెరిగాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.377 ఉండగా, మల్టీప్లెక్స్‌లలో రూ.495గా పెంచారు. బెనిఫిట్ షో తర్వాత రెగ్యులర్ షోల రేట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.265 ఉండగా, మల్టీప్లెక్స్‌లలో రూ.413గా ఫిక్స్ చేశారు.