Side Effects of Using Earphones : ఈ మధ్య కాలంలో యువత ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ లాంటి వాటిని ఎక్కువగా వాడుతున్నారు. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా చెవులకు ఇవి తగిలించేసి మ్యూజిక్ వినడంలో నిమగ్నమైపోతున్నారు. అయితే ఎక్కువ సౌండ్ పెట్టుకుని ఇలా తరచుగా ఇయర్‌ఫోన్స్‌లో(EARPHONES ) శబ్దాలను వింటూ ఉండటం వల్ల చాలా దుష్ప్రభావాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అతిగా ఇయర్ ఫోన్స్ వాడకం వల్ల ఎంతో అద్భుతమైన వినికిడిని మనం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. వీటిని తరచుగా వాడుతూ ఉండటం వల్ల వినికిడి శక్తి బాగా తగ్గిపోతుందని(HEARING LOSS) వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్ ఇలా ఇయర్ ఫోన్స్ అతిగా వాడటం వల్ల వినికిడి సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. యాగ్నిక్ తన ఇన్‌స్టా గ్రాం ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తాను సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్(SENSORINEURAL HEARING LOSS) అనే జబ్బుతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు ఇయర్ ఫోన్స్‌ని ఎలా వాడాలి అనే విషయం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.
ఇయర్‌ఫోన్స్‌ని(EARPHONES ) పెద్ద పెద్ద శబ్దాలతో ఎక్కువ సేపు వింటూ ఉండటం వల్ల ఈ సెన్సోరియన్యూరల్ హియరింగ్ లాస్ అనే జబ్బు వస్తుంది. చెవుల్లో వినికిడికి సంబంధించిన నరాలు ఉంటాయి. అవి మనం ఇయర్‌ఫోన్స్ తరచుగా వాడటం వల్ల ఉబ్బుతాయి. అందువల్ల అక్కడి నరాలు ఒత్తిడికి లోనౌతాయి. దీంతో వినికిడి తగ్గిపోతుంది. అందువల్ల శబ్దాలు మెదడుకు చేరే వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. ఫలితంగా చెవుడువస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఇయర్ ఫోన్స్‌ని రోజుకు గంట కంటే ఎక్కువగా వాడకూడదు. అది కూడా 80 డెసిబుల్స్ కంటే ఎక్కువ సౌండ్ పెట్టుకోకూడదు. తరచుగా హెడ్ ఫోన్స్ వాడేవారు కనీసం ఎనిమిది నెలలకోసారి చెవి పరీక్షలు చేయించుకోవాలి.