Kodali Nani: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. గ్రామ వాలెంటీర్లు కొందరు తనపై కేసు పోట్టారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో తమను బలవంగా వాలెంటీర్ ఉద్యోగాలకు రాజీనామా చేయించారని పోలీసులకు ఫీర్యాదు చేశారు. గ్రామ వాలెంటీర్ల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. చివరి ఎన్నికల్లో గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు నాని. ఆ తరువాత ఆయన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని, తనకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. ఇక ఏపీ గ్రామ వాలెంటీర్ల ఉద్యోగాలపై ఎలాంటి క్లారిటీ లేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజా ప్రభుత్వం వాలెంటీర్ల ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు లేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే నెల వేతనం సైతం పెంచుతామని చెప్పిన సంగతి తెలిసిందే.