Pawan Kalyan: తెలుగు ఐఏఎస్ అధికారి ఎంవీఆర్ కృష్ణతేజకు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్
జాతీయ బాలా హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికైన కేరళ ఐఏఎస్ అధికారి ఎంవీఆర్ కృష్ణ తేజకు ఏపీడీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు అధికారికంగా ఆయన పార్టీ తరఫున ట్వీట్టర్ వేదికగా పోస్టు చేశారు.
Pawan Kalyan: జాతీయ బాలా హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికైన కేరళ ఐఏఎస్ అధికారి ఎంవీఆర్ కృష్ణ తేజకు ఏపీడీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు అధికారికంగా ఆయన పార్టీ తరఫున ట్వీట్టర్ వేదికగా పోస్టు చేశారు. బాలల హక్కుల పరిరక్షణలో విశేష కృషి చేసిన కేరళ క్యాడర్ తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజ త్రిసూర్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. బాలల హక్కుల పరిరక్షణలో త్రిసూర్ జిల్లా టాప్ ప్లేస్లో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణతేజను నేషనల్ అవార్డు వరించింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ..
“జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికైన ఐఏఎస్ అధికారి ఎంవీఆర్ కృష్ణతేజకు అభినందనలు. తెలుగు రాష్ట్రానికి చెందిన కృష్ణతేజ కేరళ రాష్ట్రంలో బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతికి కృషి చేయడం గర్వించదగ్గ విషయం. ప్రస్తుతం త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతల్లో ఉన్న ఆయన ఈ జిల్లాలో బాలల హక్కులను కాపాడేందుకు ఉత్తమ విధానాలు అనుసరించారు. కరోనా సంక్షోభం సమయంలో, కేరళ వరదల విపత్తు సమయంలో కృష్ణతేజ విధి నిర్వహణలో చూపిన అంకిత భావాన్ని ఆ రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదు. ఆయన మరింతగా సేవలు అందిస్తూ ఉద్యోగులకు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరుఫున పేర్కొన్నారు.