MLC Kavitha: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన కవితపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జీషీట్‌ను దాఖలు చేసింది. శుక్రవారం ఉదయం కోర్టులో సీబీఐ తరఫు న్యాయవ్యాది దాఖలు చేశారు. మద్యం పాలసీ విధానంలో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై కోర్టులో ఈ రోజు విచారణ జరగనుంది. కవితపై సీబీఐ, ఈడీ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. కవితపై సీబీఐ జ్యుడీషియల్ కస్టడీ ఈ రోజుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌పై విచారణ కీలకం కానుంది. కవిత జ్యుడీషియల్ కస్టడీ కొనసాగింపుపై రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ చేపట్టనుంది.
ఇంతకు ముందే కవితపై ఈడీ ఆరు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు కిక్ బ్యాక్స్ రూపంలో వంద కోట్ల రూపాయలను అందించినట్లు ఈడీ అందులో పేర్కొంది. తిరిగి బెనిఫిట్ రూపంలో కవిత స్థాపించిన ఇండో స్పిరిట్ అనే సంస్థ నుంచి రూ.192 కోట్లను ప్రాఫిట్‌గా పొందినట్లు ఛార్జ్ షీట్లో పేర్కొంది. కవిత అండతో మొత్తం రూ.292 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు ఈడీ పేర్కొంది. మే నెలలో కవిత పేరును ఈడీ ఛార్జిషీట్లో తొలిసారి చేర్చింది.