PMModi: లోక్ సభ ఎన్నికల్లో రౌండు రౌండుకు ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేసిన వారణాసిలో హోరాహోరీ పోటీ కొనసాగుతుంది. ఫలితాలు అస్పష్టంగా ఉన్నాయి. ప్రతీ రౌండుకు ఫలితాల్లో మార్పు కనిపిస్తుంది. ఓ దశలో ప్రధాని వెనుకబడ్డారు. మళ్లీ లీడ్ లోకి వచ్చారు. రెండో రౌండ్ లెక్కింపు ప్రధాని మోడీ స్వల్పంగా వెనుక పడ్డారు. మళ్లీ మూడు రౌండ్ కు వచ్చేసరికి పుంజుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కన్నా 619 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ప్రధానికి ఇప్పటి వరకు పోలైన ఓట్లు 36,424 కాగా, ఆయన ప్రత్యర్థి అజయ్ రాయ్ కి 35,805 ఓట్లు నమోదు అయ్యాయి. ప్రస్తుతం బీజేపీ శ్రేణులు అందరూ వీరి ఫలితాలపై దృష్టి పెట్టారు.