Viral News: ఆకాశంలో అప్పుడప్పుడు అద్భుతాలు చోటుచేసుకుంటాయి. తాజాగా స్పెయిన్, పోర్చుగల్లోని ఓ ప్రాంతంలో ఆకాశంలో ఓ పెద్ద వెలుగు దర్శనం ఇచ్చింది. వందల కిలోమీటర్ల వరకు ఆ వెలుగు కనిపించినట్లు స్థానికులు చెప్పారు. అయితే ఆ వెలుగు ఏంటని ముందు అందరూ ఆశ్చర్యానికి లోనైనా త్వరగానే అదేంటో కనిపెట్టారు. ఆకాశం నుంచి భారీ సైజులో ఉల్క నెలపై పడింది. దానికి సంబంధించిన వెలుగు అని నిపుణులు చెబుతున్నారు.
అయిదే ఆ ఉల్క ఎక్కడ పడిందో ఎవరు కూడా కచ్చితంగా చెప్పలేక పోతున్నారు. కానీ క్యాస్ట్రో డైరో ప్రాంతంలో అది పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటి జనులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే గతంలో 2013 ప్రాంతంలో కూడా రష్యాలోని చెల్యాబిన్స్ అనే ప్రాంతంలో ఇంతకంటే పెద్ద స్థాయి ఉల్కలు పడ్డాయి. అప్పట్లో అవి భారీ ఉల్కలు అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒక్క పెద్ద స్థాయి ఉల్క 500 కిలో టన్నుల టీఎన్టీకీ సమానమైన శక్తి కలిగి ఉంటుందని అంచనావేశారు.
Incredible footage of a meteor shooting across the skies of Portugal and Spain. pic.twitter.com/FSTm7pIyii