»Sandeep Reddy Vanga Sandeep Reddy Vanga Is Not The Type To Sit Still
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగ.. ఊరుకునే రకం కాదు!
ఎవ్వరు ఏం అనుకున్న సరే.. తాను చెప్పాల్సింది చెబుతాడు, సినిమాలో తీయాల్సింది తీసి తీరుతాడు. అలాగే.. తనపై ఎవరైనా కామెంట్ చేస్తే అస్సలు ఊరుకోడు. లేటెస్ట్గా మరోసారి ఇచ్చిపడేశాడు సందీప్ రెడ్డి వంగ.
Sandeep Reddy Vanga: Sandeep Reddy Vanga.. is not the type to sit still!
Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ రూటే సపరేటు. ఇండస్ట్రీలో చాలామంది.. వాళ్ల పై వచ్చే కామెంట్లపై కాస్త సెలెంట్గానే ఉంటారు. కానీ సందీప్ రెడ్డి.. అలా వింటూ, చూస్తు ఊరుకునే రకం కాదు. తన పై ఎవ్వరైనా ఏదైనా కామెంట్ చేస్తే.. వెంటనే ఇచ్చిపడేస్తుంటాడు. అనిమల్ సినిమా పై చాలామంది రకరకాలుగా విమర్శలు చేశారు. అలాంటి వారందరికీ గట్టి కౌంటర్ ఇచ్చాడు సందీప్. ఇక ఇప్పుడు కూడా ఇచ్చిపడేశాడు.
బాలీవుడ్ నటుడు ఆదిల్ హుస్సేన్ చేసిన కామెంట్స్ పై దిమ్మతిరిగే రిప్లే ఇచ్చాడు. ఆదిల్ హుస్సేన్ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ సినిమాలో నటించాడు. అయితే.. రీసెంట్గా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన కెరీర్లో ఆ సినిమా ఎందుకు చేశానా? అని బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చాడు ఆదిల్. దీనిపై సందీప్ ఇచ్చిన కౌంటర్‌గా వైరల్‌గా మారింది. నా సినిమాతోనే నీకు ఈ పేరొచ్చింది.. ఆ విషయం మరిచిపోవద్దని అన్నాడు సందీప్.
నువ్వు చేసిన 30 ఆర్ట్ సినిమాల వల్ల రాని పేరు.. ఇప్పుడు నువ్వు బాధపడే ఆ ఒక్క బ్లాక్బస్ట్తోనే వచ్చింది. ఆ సినిమాలో నిన్ను తీసుకున్నందుకు నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను.. మీకు సినిమా ప్యాషన్ కంటే అత్యాశ ఎక్కువంటూ.. రాసుకొచ్చాడు. అంతేకాదు.. ఇప్పటికైనా ముంచుకుపోయింది లేదు.. ఆ సినిమాలో నీ ముఖాన్ని ఏఐ సాయంతో మార్చేస్తాను.. అని సందీప్ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏదేమైనా సందీప్ అంటే.. ఆ మాత్రం ఉంటది మరి!