Kangana Ranaut reacted to the news that she ate beef
Kangana Ranaut: కంగనా రనౌత్ బీఫ్ తిన్నది అంటూ ఓ కాంగ్రెస్ నేత పలుమార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. తాను సినిమా నటీ కాబట్టి ఏదైనా చేస్తుంది అనే అర్థం వచ్చేలా వ్యఖ్యానించారు. తాజాగా ఆ మాటలపై ఈ బాలీవుడ్ నటి స్పందించారు. ఇటివలే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ లోక్ సభ స్థానం నుంచి కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. తనపై తప్పుడు ఆరోపణలను నిరాధారణమైనవి అని వాటిని తీవ్రంగా ఖండించారు. తాను హిందువునని గర్విస్తున్నట్టు చెప్పారు.
తాను బీఫ్, అదేవిదంగా రెడ్‌మీట్ ఎప్పుడూ తినలేదని తన సోషల్ మీడియా ఖాతా అయినా ఎక్స్ ద్వారా తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాబట్టి తన ఇమేజ్ డ్యామెజ్ చేయాలని, కొత్తమంది కాంగ్రెస్ నేతలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దశాబ్దాలుగా యోగా, ఆయుర్వేదం గురించి ప్రచారం చేస్తున్నానని, తన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు మానుకోవాలని సలహా ఇచ్చారు. తాను గర్వించదగ్గ హిందువునని, ప్రజలకు తానేంటో తెలుసని వివరించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాల వలన ప్రజలను తన నుంచి దూరం చేయలేరంటూ రాసుకొచ్చారు. అప్పట్లో కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు గురించి కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.