Mrunal Thakur: మృణాల్‌కు ఫస్ట్ దెబ్బ.. హ్యాట్రిక్ మిస్?
ప్రస్తుతం టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. అమ్మడు చేసిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ అయ్యాయి. కానీ ఇప్పుడు మూడో సినిమాతో మృణాల్‌కు ఫస్ట్ దెబ్బ పడిందనే చెప్పాలి.
Mrunal Thakur: సీతారామం సినిమాతో సూపర్ హిట్ సొంతం చేసుకుంది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో చేసిన సీత పాత్రతో తెలుగు ఆడియెన్స్‌కు బాగా దగ్గరైంది. ఇక ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని సరసన నటించిన హాయ్ నాన్న సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నానితో సూపర్ జోడీ అనిపించుకుంది. దీంతో సీతారమం సినిమాతో హిట్ వచ్చిందని.. మృణాల్ ఎడాపెడా సినిమాలు చేయకుండా.. కెరీర్‌ను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటుందని అనుకున్నారు. కానీ అమ్మడికి హ్యాట్రిక్ మిస్ చేస్తూ ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చింది. గీతా గోవిందం కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. విజయ్ దేవరకొండ, పరుశురాం కలిసి ఈ సినిమా చేశారు. కానీ భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చిన ఫ్యామిలీ స్టార్ కాస్త నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది.
దీంతో.. విజయ్ దేవరకొండ కెరీర్లో మరో ఫ్లాప్ పడినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు ఫిక్స్ అయిపోయాయి. కాబట్టి.. తెలుగులో మృణాల్‌కు ఫ్యామిలీ స్టార్ రూపంలో ఫస్ట్ దెబ్బ పడినట్టే. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్లు అందుకున్న మృణాల్ ఠాకూర్‌ని.. ఫ్యామిలీ స్టార్ మూవీలో సరిగా వాడుకోలేకపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే.. మృణాల్ కెరీర్ పై పెద్దగా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు తక్కువ. సినిమా ఫ్లాప్ అయినా.. మృణాల్ మాత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరైనట్టేనని చెప్పాలి. కాకపోతే.. హ్యాట్రిక్ హిట్ మిస్ అయిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. మృణాల్‌కు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. సీతారమం దర్శకుడు హనురాఘవపూడితో ప్రభాస్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే.. మ్యూజిక్ డైరెక్టర్‌గా విశాల్ చంద్రశేఖర్ ఫిక్స్ అయిపోయాడు. హీరోయిన్గా మృణాల్ దాదాపుగా ఫైనల్ అయినట్టుగా సమాచారం.