స్టార్ హీరోయిన్ సమంతను అభిమానులు ఎవ్వరు మరిచిపోలేరు. అలా అని ఓ హీరో కూడా మరిచిపోలేకపోతున్నాడంటే.. ఆ వ్యవహారం వేరేలా ఉంటుంది. గతంలో సామ్‌తో ప్రేమ అంటూ పుకార్లు వచ్చిన హీరో.. అమ్మడిని ఇంకా మరిచినట్టుగా లేడు.
Samantha: సమంత ఎప్పుడు హాట్ టాపికే. ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సమంత.. మొదటి సినిమా నుంచే నాగ చైతన్యతో ప్రేమలో పడిపోయింది. కొన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ఎఫైర్ మెంటైన్ చేసిన చై, సామ్.. ఫైనల్‌గా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ మూన్నాళ్ల ముచ్చట అన్నట్టుగా.. ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరి కెరీర్‌తో వారు బిజీగా ఉన్నారు. కాకపోతే.. సామ్ కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే.. నాగ చైతన్య లవ్ మ్యాటర్ రివీల్ కాకముందు సమంత ఓ హీరోతో ప్రేమలో ఉందనే ప్రచారం జోరుగా జరిగింది. ఏ హీరోయిన్‌తో సినిమా చేస్తే.. ఆమెతో బొమ్మరిల్లు హీరో సిద్దార్త్ ఎఫైర్ పెట్టుకుంటాడనే టాక్ ఉంది. ఈ క్రమంలో సమంతతో కూడా లవ్‌లో పడిపోయాడని వినిపించింది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబుతున్నట్టుగా వార్తలు వచ్చాయి.
కానీ ఇద్దరికి పడకపోవడంతో విడిపోయారని అన్నారు. ఆ తర్వాత చై, సామ్ లవ్ మ్యాటర్ బయటికి రావడంతో.. సిద్ధార్త్ ప్రేమ విషయం పాతాళానికి పడిపోయింది. ప్రస్తుతం సిద్దు, అదితి రావు హైదరీతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. అయినా కూడా సమంతను ఇంకా మరిచిపోయినట్టు లేడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సామ్ గురించి సిద్దు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మిస్ బ్యూటిఫుల్ ఎవరు? అని అడగ్గా.. వెంటనే సమంత అని చెప్పాడు సిద్ధార్త్. అంతేకాదు.. మిస్ పర్ఫెక్ట్ ఎవరు? అని మరో ప్రశ్న అడగ్గా.. అప్పుడు కూడా సమంత పేరునే చెప్పాడు. దీంతో సమంతను సిద్ధార్త్ ఇంకా మర్చిపోయినట్టు లేడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.