RR: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ ఆశయ సాధనకు కృషి చేయాలని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, నాయకులు ప్రకాష్ గౌడ్, రామస్వామి, సుభాన్ గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 316వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు.