Village Girl Group Dances To Kay Sera Sera Leaves Viewers Spellbound
Girl Group Dance: గ్రామీణ యువతులు చేసిన డ్యాన్స్ (dance) తెగ ఆకట్టుకుంటోంది. 1999లో వచ్చిన ‘పుకార్’ మూవీ నుంచి ‘కే సెరా సెరా’ అనే పాటకు యువత స్టెప్పులు వేశారు. ఈ పాటను కవితా కృష్ణమూర్తి, శంకర్ మహదేవన్ ఆలపించారు. పాటకు విపరీతమైన ప్రజాదరణ లభించింది. ఇప్పుడు యువత (girls) స్టెప్పులు వేశారు.
యువత చేసిన నృత్యాన్ని జనం ప్రశంసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువత ఒకేలా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. దీనిని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. యువతులు అంతా ఒకేలా పాటను ప్రదర్శించడానికి చాలా రోజులు కృషి చేసి ఉంటారని అంటున్నారు.
యవతులకు ఇంటర్నెట్లో అభినందనల వస్తున్నాయి. ఆ వీడియోకు లైక్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ఈ క్లిప్‌లో కాలనీ బయట నిలబడి ఉన్న అమ్మాయిల గుంపు డ్యాన్స్ చేస్తూ వీడియో ప్రారంభం అవుతుంది. పాట మొదలైన వెంటనే వారు దానికి పవర్ ప్యాక్ పెర్ఫామెన్స్ ఇస్తారు. ఈ వీడియోను @gmgjddance ద్వారా Instagramలో పోస్ట్ చేశారు.