»The Gods Are Cold Sweaters Shawls Blankets Are Arranged
Video Viral: దేవుళ్లకు చలి..స్వెటర్లు, శాలువాలు ఏర్పాటు!
శీతాకాలంలో చలి నుంచి దేవుళ్లను రక్షించడానికి భక్తులు వెచ్చని దుస్తులతో అలంకరించారు. దేవుళ్ల విగ్రహాలకు స్వెటర్లు, దుప్పట్లు, శాలువాలతో అలంకరించి తమ భక్తిని చాటుకున్నారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్లో జరిగిన ఈఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శీతాకాలం ప్రారంభమైంది. ప్రజలను చలి గజగజ వణికిస్తోంది. చలి నుంచి తమని తాము రక్షించుకోవడానికి చాలా మంది సెటైర్లు ధరిస్తున్నారు. మరికొందరు దుప్పట్లు, శాలువాలతో దర్శనమిస్తున్నారు. మనుషులకైతే చలి ప్రభావం ఉంటుంది. అయితే కొందరు భక్తులు తాము కొలిచే దేవుళ్ల విగ్రహాలకు కూడా చలి వేస్తోందని ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రాణప్రతిష్ట చేసిన ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాలకు స్వెటర్లు, దుప్పట్లు, శాలువాలతో అలంకరించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్లో చోటుచేసుకుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో:
#WATCH | Madhya Pradesh: The idols of all the gods were dressed in warm clothes to protect them from the cold at the Sankat Mochan Hanuman Temple in Bhopal. (07.12) pic.twitter.com/9OAguvafOL
సంకట మోచన హనుమాన్ దేవాలయంలోని దేవుళ్లకు భక్తులు స్వెటర్లు, శాలువాలను ఏర్పాటు చేశారు. శీతాకాలంలో చల్లటి గాలి నుంచి దేవుళ్లను రక్షించడానికి వెచ్చని దుస్తులతో అలంకరిస్తునట్లు భక్తులు తెలిపారు. భక్తులు కానుకలుగా సమర్పించిన స్వెటర్లు, దుప్పట్లు, శాలువాలను పూజారి అక్కడి దేవుళ్ల విగ్రహాలకు అలంకరించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది. వీడియోలో హనుమంతుడు, గణేషుడు, శివుడు, ఇతర దేవుళ్లకు స్వెటర్లు, శాలువాలతో అలంకరించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోకు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట సందడి చేస్తోంది.