NZB: వెజ్ మంచురియాలో కోడిగుడ్డు పొట్టు వచ్చిన ఘటన నగరంలో సోమవారం చోటు చేసుకుంది. చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఓవ్యక్తి సాయంత్రం అతిథి రెస్టారెంట్లో వెజ్ మంచూరియాను స్విగ్గీలో ఆర్డర్ చేశారు. డెలివరీ బాయ్ ఇంటికి తెచ్చి ఇచ్చాడు. మంచూరియా తింటున్న క్రమంలో ఒక్కసారిగా కోడిగుడ్డు పొట్టు వచ్చింది. కంగుతిన్న వ్యక్తి హోటల్ యజమానిని అడగ్గా గుడ్డు పొట్టే కదా అనడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.