WGL: ఉపాధ్యాయుల సంఖ్యను కుదించే విదంగా ఉన్న అశాస్త్రీయమైన జి. ఓ. 25ను అమలు చేయాలని పాఠశాల విద్యా సంచాలకులు జిల్లా కలెక్టర్లను ఆదేశించడాన్ని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గోవిందరావు వ్యతిరేకించారు. గురువారం గీసుగొండ మండలంలోని వివిధ పాఠశాలలను డీటీఎఫ్ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు.