వరంగల్: ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో రేపు (3న) తల పెట్టిన మహాసమ్మేళనం కరపత్రాలను వర్ధన్నపేటమండలంలోని కడారిగూడెంలో జిల్లా కోశాధికారి మురళీకృష్ణ, సోషల్ మీడియా ఇంఛార్జ్ రంజీత్ కుమార్ ఆవిష్కరించి మాట్లాడారు. సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సతీశ్, ఎల్లయ్య, చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.