MDK: దీపావళి పండుగ వేళ జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీలోని మల్లన్న బస్తీకి చెందిన మున్నా యాదవ్ ఇల్లు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జరిగిన నష్టానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.