SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో అగుల్ల శ్రీనివాస్(48) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కూతురును అత్తింటి వారు వేధిస్తున్నారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదని మనస్థాపం చెందిన శ్రీనివాస్ గ్రామ శివారులోని పాడుబడిన వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన స్థలానికి కొద్దిసేపటి పోలీసులు చేరుకున్నారు.