అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వెలువడలేదని ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో జీవించటమంటే ఎల్లప్పుడూ తామే గెలవమని గుర్తించటం అని పేర్కొన్నారు. అందుకే శాంతియుతంగా అధికార మార్పిడికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా, ఆమె రన్నింగ్మేట్ టిమ్వాజ్ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేశారని ప్రశంసించారు.