MBNR: కుల గణన జీవోపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో మధ్యాహ్నం రెండు గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన మేధావులు, సీనియర్ నాయకులు హాజరు కావాలని పిలుపునిచ్చారు.