NLG: శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు(312 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 589.30 అడుగులు(309 టీఎంసీలు) నీరు ఉంది. ఇన్ ఫ్లో 36,600 క్యూసెక్కులుండగా.. జల విద్యుత్ కేంద్రం, కుడి, ఎడమ, వరద కాల్వ, ఎస్ఎల్బీసీకి మొత్తం 48,775 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.